Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:02:33
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే రెండు పేర్లు వినిపిస్తాయ్. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. వీళ్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం చాలా కష్టమైన విషయం. డ్యాన్సింగ్ లో ఒక్కోరిదీ ఒక్కో స్టైల్ కావడం.. ఎవరి తీరులో వారు సూపర్బ్ డామినేష్ చూపిస్తుండడంతో ఎవరు బెస్ట్ అనే విషయంలో ఆడియన్స్ కి కూడా కన్ఫ్యూజన్ తప్పట్లేదు.

అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ రిలీజ్ సందర్భంగా.. యంగ్ టైగర్ కు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. మీకు ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టమంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రశ్న ఎదురైంది. సహజంగా అయితే.. ఇలాంటి టిపికల్ ప్రశ్నలకు.. డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చి తప్పించుకోవడం టాలీవుడ్ హీరోల ఆనవాయితీ. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. హీరోల తీరు కూడా మారుతోంది. పైగా కొడుకు అభయ్ రామ్ పుట్టిన తర్వాత ఎన్టీఆర్ సరళి కూడా చాలానే మారిపోయింది. అందుకే అనుకోకుండా.. తడుముకోకుండా.. తనకు బన్నీ డ్యాన్సులు అంటే చాలా ఇష్టం అనేశాడు జూనియర్.

నా ఫేవరేట్ డ్యాన్సర్ అల్లు అర్జున్. తన డ్యాన్స్ మూమెంట్స్ నేను చాలా ఇష్టపడతాను అని ఎన్టీఆర్ చెప్పడం.. రియల్లీ రీసెంట్ ఇంటర్వ్యూలలో హైలైట్ ఆన్సర్ అనాల్సిందే. ఎన్టీఆర్ రేంజ్ ఉన్న స్టార్ హీరో.. ఇలా మరో స్టార్ ను తన ఫేవరేట్ అని చెప్పడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎన్టీఆర్ లో వచ్చిన మార్పును సూచిస్తోందని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,