Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 10:58:17
facebook Twitter Googleplus
Photo

100వ చిత్రం తర్వాత బాలయ్య ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా సినిమాలను ఒకే చేస్తున్నాడు. కాకపోతే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ అందుకున్న బాలయ్య 101వ సినిమా పైసా వసూల్ తో మాత్రం అభిమానులకు నిరాశను మిగిల్చాడు. ఇక దాన్ని గురించి ఆలోచించకుండా బాలయ్య తన 102వ సినిమాను స్టార్ట్ చేశాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

అయితే గత కొంత కాలంగా ఊరిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా బాలయ్య లైన్ లో పెడుతున్నట్లు కామెంట్స్ వినబడుతున్నాయి. అంతే కాకుండా ఆ సినిమాను కె. ఎస్ రవి కుమారే తెరకెక్కిస్తున్నట్లు కూడా కామెంట్స్ వినబడ్డాయి. ఇక తేజా కూడా ఆ బయోపిక్ ను తీసేందుకు సిద్ధంగా ఉన్నారని రూమర్స్ వచ్చాయి. కానీ అధికారికంగా ఆ విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు. బాలయ్య కూడా బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని అంటున్నారు గాని దానిపై కరెక్ట్ గా వివరణ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు బాలయ్య నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నాడట. తన కొత్త ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి - సాయి కొర్రపాటి తో కలసి ఒక సినిమాను నిర్మిస్తాడని టాక్. అయితే అది బాలయ్య మూవీ కాదట.

తన తనయుడు మోక్షజ్ఞ ని లంచ్ చేయబోయే చిత్రంలో బాలయ్య ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం క్రిష్ హిందీలో మణికర్ణిక - ద క్వీన్స్ ఆఫ్ జాన్సీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది అంటే మోక్షజ్ఞ వచ్చే సమ్మర్ లోనే తెరంగ్రేటం చేయనున్నాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,