Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:30:18
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ .. దర్శకుడు సుకుమార్ చిత్రబృందం లండన్ వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలుకానుంది. ఆ రోజు నుంచి దాదాపు 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి 'నాన్నకి ప్రేమతో' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

టైటిల్ ని బట్టే ఇది తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దంపట్టే కథాంశమని అర్థమైపోతోంది. కుటుంబ నేపథ్యంలో కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ ని కొత్త లుక్ తో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా మెరవనుండగా, జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే పనిలో ఎన్టీఆర్ అభిమానులు బిజీయైపోవడం ఖాయమన్నమాట.

,  ,  ,  ,  ,  ,  ,  ,