Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 11:01:05
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ తనలోని ప్రతిభను అనేక రకాలుగా బయట పెట్టాడు. నటుడిగా - దర్శకుడిగా - సింగర్ గా తన అభిమానులను అనేక రకాలుగా అలరించాడు. తన పాటతో మరోసారి అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి పవన్ రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్నఈ సినిమాలో పవన్ ఓ పాట పాడనున్నాడని సమాచారం.

గతంలో కొన్ని సినిమాల్లో పవన్ పాటలు పాడాడు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రంలో పాడిన కాటమరాయుడా.. కదిరి నరసింహుడా సాంగ్ పెద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు పవన్. ఈ సినిమా పై పవన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.

ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కీర్తి సురేశ్ - అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఓ పాట పాడనున్నారని సమాచారం. కాటమరాయుడా.. స్థాయిలో ఈ పాట కూడా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

పవన్ తన అప్ కమింగ్ మూవీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

,  ,  ,  ,  ,  ,  ,