Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jan-2016 14:49:23
facebook Twitter Googleplus
Photo

భారీ అంచనాల మధ్య విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. బెజవాడలోని యువరాజ్ థియేటర్ వద్ద సినీ అభిమానులు టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సినిమా థియేటర్ యాజమాన్యం సినిమా టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

బుధవారం విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి టిక్కెట్లు దొరకని పలువురు అభిమానులు థియేటర్ వద్ద ఆందోళన చేపట్టటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని అభిమానులు థియేటర్ మీద రాళ్ల దాడికి పాల్పడ్డారు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతుందన్న వాదనతో వాతావరణం మరింత వేడెక్కింది.

,  ,  ,  ,  ,