Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2015 10:13:22
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా హిట్టయితే ఇక ఆ దర్శకుడికి ఆఫర్లు వచ్చి పడిపోతాయి. ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోతారు. ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఈ దర్శకుడు రూపొందించిన 'పటాస్' చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఈ రెస్పాన్స్ తో ధియేటర్లు కూడా పెంచారు. ఇప్పుడు దీనికి సూపర్ హిట్ స్థాయి రావడంతో దర్శకుడికి పలువురు ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా పిలిచినట్టు చెబుతున్నారు. అయితే, దర్శకుడు అనిల్ మాత్రం ఇంకా ఎవరికీ కమిట్ కాలేదట.

,  ,  ,  ,  ,