Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2017 11:05:29
facebook Twitter Googleplus
Photo

థ్రిల్లర్ ను మిక్స్ చేసి ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ వి.ఐ.ఆనంద్. యంగ్ హీరో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఊహించని ట్విస్టులతో సాగి.. చివరి వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ కొనసాగేలా చేసింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడంతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ గా వి.ఐ.ఆనంద్ కు పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా ఆనంద్ మెగా ఫ్యామిలీలోని అల్లు శిరీష్ హీరోగా ఒక్క క్షణం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగో ఈ మధ్య రిలీజ్ చేశాడు. ఈలోగో చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో పాటు క్యూరియాసిటీ కూడా పెంచింది. చిందవందరగా పడి ఉన్న అగ్గిపుల్లలు ఈ లోగో లో కనిపిస్తాయి. కాస్తంత జాగ్రత్తగా... దగ్గరగా గమనించి చూస్తే ఈ అన్ని అగ్గిపుల్లల్లో రెండు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా అగ్గిపుల్లలన్నీ నిప్పు అంటుకునే అంచున ఎర్రగా ఉంటే.. రెండు పుల్లలు మాత్రం ప్రత్యేకమైన ప్లేసులో పసుపు అంచుతో కనిపిస్తాయి. ఈలోగో లో స్టోరీకి సంబంధించిన లింక్ ఉండటం వల్లే అలా డిజైన్ చేశారని యూనిట్ సభ్యుడొకరు చెప్పారు.

ఒక్క క్షణం టైటిల్ కు లవ్ వెర్సెస్ డెస్టినీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీనిని బట్టి ఆనంద్ ఈ సినిమా కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడు తరహాలో థ్రిల్లర్ తో కూడిన ప్రేమకథే తీస్తున్నట్టు తెలుస్తోంది. జెంటిల్ మెన్ తన క్యూట్ నటనతో ఆకట్టుకున్న నార్త్ బ్యూటీ సురభి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,  ,