Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 15:05:12
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి చిన్నప్పటి నుండి చాలామంది కజిన్స్ ను అక్కడ దింపాడట. అలాగే చాలామంది ఫ్రెండ్స్ ను గేటు బయట కలవడానికి వెళ్ళాడట. కాని ఒక్కసారి కూడా అసలు సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ వారు మన అల్లు వారబ్బాయిని లోపలికి మాత్రం రానివ్వలేదు. మనోడ్నే కాదు.. అసలు సాధారణంగా అబ్బాయిలను ఈ కాలేజ్ గేట్ దాటి లోపలికి పోనివ్వరు. అయితే ఇవాళ మాత్రం ఎంట్రీ ఇచ్చారు.

ఎప్పటినుండో కేవలం గేటు మాత్రమే చూస్తూ ఉన్న అల్లు శిరీష్ ను ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ లోపలకి రానిచ్చారట. ఎందుకంటే అక్కడ జరిగిన ఓ ప్రోగ్రామ్ కు ఈయన చీఫ్ గెస్టుగా వెళ్లారు కాబట్టి. అక్కడికి చీఫ్ గెస్టుగా వెళ్ళిన ఈ కుర్రహీరో.. అక్కడ అమ్మాయిలక్ స్టేజీ మీద స్పీచ్ ఇచ్చాడు కూడా. ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ వారు మనోడికి ఇక జ్ఞాపికను కూడా బహుకరించారులే. ఒక విధంగా చూస్తే.. ఈరోజు ఇలా ఉమెన్స్ కాలేజీకి పిలిచి సత్కరించారంటే అందుకు 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా సక్సెస్ కారణం అనే చెప్పాలి.

ఇకపోతే మల్లిడి వేణు డైరక్షన్లో తదుపరి సినిమాను చేస్తున్న శిరీష్.. ఆ రోల్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నాడట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,