Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 12:16:23
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చేలా చేసాడు ఓ స్టార్ కమీడియన్. పవన్ ఇలా లొకేషన్ లో హాస్యనటులు పై మండిపడటం రెండో సారి గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో జబర్ధస్థ్ ఫేమ్ షకలక శంకర్ పై పవన్ మండిపడ్డాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ లో ఓ హ్యాపెనింగ్ కమీడియన్ కు పవన్ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇంతకి పవన్ కు కోపం తెచ్చిన ఆ కమీడియన్ ఎవరనేది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం గతంలో త్రివిక్రమ్ - నితిన్ కాంబినేషన్ లో వచ్చిన 'అఆ' సినిమాలో ఆ కమీడియన్ ఫుల్ లెంత్ రోల్ చేశాడని చెబుతున్నారు. ఆ చిత్రంలో ఆ హాస్యనటుడు క్యారెక్టర్ పండటంతో పవన్ సినిమాలో కూడా త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడని వినిపిస్తోంది.

ఇక పవన్ కు కోపం వచ్చేంతగా ఆ కమీడియన్ ఏం చేశాడనే విషయం పై రకరకాల ఊహగానాలు వీస్తున్నాయి. షాట్ గ్యాప్ లో పవన్ - త్రివిక్రమ్ డిస్కషన్ లో ఉంటే వారి మధ్యకు వెళ్లి జనసేన విషయాలు గురించి ప్రస్తవించడమే ఆ కమీడియన్ పై పవన్ మండిపడటానికి అసలు కారణం అని తెలిసింది

,  ,  ,  ,  ,