Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 19:25:53
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు చూపంతా ఒకటే విషయంపై. సర్దార్ ఫ్లాప్ షో కళ్ళ ముందు కనిపిస్తోంది. కాని ఇలా ఫ్లాపులు ఇచ్చాక హిట్టు కూడా వస్తోంది. సో.. ఈసారి పవన్ ఖాతాలో ఆ అతి పెద్ద హిట్టు వేసేదెవరు?

నిజానికి సర్దార్ సినిమా ఫ్లాపవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ అందించిన స్టోరీ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రభావం అప్పుడే ఫ్యాన్స్ మీద నుండి పోకపోయినా కూడా.. పవన్ మాత్రం తదుపరి సినిమాకు మూవ్ అయిపోతున్నాడు. ఈసారి ఎస్.జె.సూర్య డైరక్షన్ లో సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్టవ్వాలంటే ఆ విషయం సూర్య చేతుల్లో ఉంటుందా? అబ్బే లేదు. పవన్ ఇన్వాల్వ్ కాకపోతే సినిమా ఆటోమ్యాటిక్ గా హిట్టవుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి పవన్ కు హిట్టు రావాలంటే అందుకు పవనే సహకరించుకోవాలి.

ఇప్పటికే స్ర్కిప్టు మొత్తం రెడీ అయిపోయిన దృష్ట్యా.. ఈ సినిమాను మే మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ లోకి తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత ఫాస్టుగా చేస్తున్నాడంటే.. ఖచ్చితంగా ఈ సినిమాలో పవన్ వేలు పెట్టట్లేదని అందరూ నమ్ముతున్నారు కూడా. చూద్దాం రిజల్టు ఎలా ఉండబోతోందో.

,  ,  ,  ,  ,  ,