Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2014 11:00:32
facebook Twitter Googleplus
Photo

ఈ నెల 30న తెలుగు సినిమా రంగం యావత్తు కలసి హైదరాబాదులో నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొనడానికి తారలు ఎవరికి వారు స్వచ్చందంగా ముందుకువస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ తమ కార్యక్రమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా తమ స్టయిల్ లో అలరించడానికి రెడీ అవుతున్నాడు. తానొక్కడే ఓ కామెడీ షో చేయడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. సుమారు అరగంట పాటు ఆయన కామెడీ షో రన్ అవుతుందనీ, ఇది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందనీ అంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా తానే సిద్ధం చేసుకున్నాడట. అలాగే, మరికొందరు కమెడియన్లు కూడా తమ తమ స్కిట్టులతో సిద్ధమవుతున్నారు. ఆనాటి ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం హక్కులను జెమినీ టీవీ పొందిన విషయం విదితమే!

,  ,  ,  ,  ,