Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2016 17:21:06
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ను సూపర్ పేస్ మీద కంప్లీట్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో కీలకమైన సన్నివేశాలు జరుపుకుంటున్న ఈ మూవీకి మార్చిలో ఆడియో వేడుక చేయనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఈరోస్ ఇంటర్నేషనల్ చెప్పేయడంతో.. సినిమాని ఫినిష్ చేసేందుకు వేగం పెంచేశారు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ బాబీ.

సర్దార్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డ పవన్.. తర్వాత ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఫుల్ స్పీడ్ చూపించేస్తున్నాడు. ఇప్పటికే తనకు ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ - కొమరం పులి లాంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన ఎస్ జే సూర్యకు ఓకే చెప్పిన పవన్.. స్టోరీ విషయంలో కూడా ఫైనల్ డెసిషన్ కు వచ్చేశాడట. తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన 'వీరం'ను రీమేక్ చేయనున్నాడని ఇప్పటివరకూ వార్తలొచ్చాయి. కానీ ఇందులో ఛేంజ్ వినిపిస్తోంది.

ప్రాజెక్ట్ విషయంలో ఛేంజ్ వచ్చింది కానీ.. రీమేక్ ఖాయమే అంటున్నారు. అది కూడా అజిత్ మూవీనే. గత దీపావళికి వచ్చిన అజిత్ మూవీ 'వేదాళం'ను రీమేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. వేదాళం నిర్మాత కూడా వచ్చి పవన్ కలిసి వెళ్లాడని సర్దార్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పవన్ రీమేక్ ఫిక్స్ అయిపోయినట్లే అన్నమాట.

,  ,  ,