Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2016 16:07:09
facebook Twitter Googleplus
Photo

విక్ర‌మ్ కె.కుమార్‌? చేసింది త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకొన్నాడు. అక్కినేని మూడు త‌రాల హీరోల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి మ‌నంతో ఓ మ్యాజిక్ చేశాడు. మ‌నం త‌ర‌వాత విక్ర‌మ్ కి టాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టాయి. అయితే? మ‌ళ్లీ త‌న‌దైన స్టైల్‌లోనే కోలీవుడ్ వెళ్లి సూర్య తో 24 తీశాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో తన తర్వాత సినిమాల గురించి ప్రకటించాడు విక్రమ్. అల్లు అర్జున్ , మహేష్ బాబు లతో విక్రమ్ ఓ రెండు సబ్జెక్ట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్క్ అవుట్ అయ్యాయి. దీనిపై విక్రమ్ మాట్లాడుతూ.. బన్నీ తో ఓ సినిమా ఓకే అయ్యింది. చాలా కొత్త సబ్జెక్ట్ ఇది. అలాగే మహేష్ సార్ తో కూడా సినిమా చేయాలి. అయితే మహేష్ కి వున్న కమిట్మెంట్స్ కారణంగా దానికి కొంచెం టైం పడుతుంది. ముందు బన్నీ సినిమా ఉటుంది? అని చెప్పుకొచ్చాడు విక్రమ్. మొత్తమ్మీద విక్రమ్ కొత్త సినిమాలు రెండు టాలీవుడ్ లోనే అన్నమాట.

,  ,  ,