Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:17:42
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్... సినిమాల్లో - రాజకీయాల్లో కూడా సంథింగ్ స్పెషల్. అందుకే ఆయనంటే అభిమానులకు క్రేజ్. ఏ అంశంపై ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆయన ఆయన భగవంతుడిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అది విన్న ఆయన అభిమానులు పవర్ స్టార్ లో ఇంత దైవభీతి ఉందా అని ఆశ్చర్యపోతున్నారట. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవానికి హాజరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భగవంతుడంటే తనకు విపరీతమైన భయం అని చెప్పారు.

తనకు సంబంధం లేని వేదిక అయినా ఇక్కడకు పిలవడం సంతోషంగా ఉందని చెప్పిన ఆయన పండితులను.. దైవ హారతులను ఇలాంటి హారతులు దర్శించుకునే అవకాసం దక్కినందుకు సంతోషం వ్యక్తంచేశారు. చిన్నప్పటినుంచీ తనకు భగవంతుడు అంటే చాలా భయమని పవన్ తెలిపారు. తనను అందరూ చూస్తున్నారు.... తప్పు చేస్తే నిలదీస్తారు అన్న భయం వల్లే అనుక్షణం జాగ్రత్తగా ఉంటానని.. అదే తనను క్రమశిక్షణగా ఉంచిందని పవన్ చెప్పారు. తను ఈ రోజున తప్పు చేయకుండా ఉండటానవికి కారణం భగవంతుడే అని తేల్చి చెప్పారు.

పవన్ కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యారు. భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అన్నదే తన నమ్మకమని... దేవుడంటే అడిగింది ఇచ్చేవాడు కాదని... అవసరమైనది ఇచ్చేవాడే భగవంతుడని పవన్ తెలిపారు. కాగా పవన్ మాట్లాడుతున్నప్పుడు ఎప్పటిలానే ఆయన అభిమానులు పవన్.. పవన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆయన దైవ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చోట తన పేరు వినిపించకూడదని... దేవుడి పేరు తప్ప ఇంకెవరి పేరూ స్మరించరాదని సుతిమెత్తగా చెప్పారు.

,  ,  ,  ,  ,