Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:49:33
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ లేటెస్ట్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'రేయ్' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఓ పాటను పెట్టిన సంగతి విదితమే. 'పవనిజం' పవర్ ను వివరించే ఈ పాటను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం చిత్ర దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి హైదరాబాదులో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో ఈ ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తారు. ఈ పాటను దివంగత చక్రి కంపోజ్ చేయగా, చంద్రబోస్ రాశాడు. పాప్ సింగర్ నోయల్ షాన్ పాడడం జరిగింది. విశేషం ఏమిటంటే, ఈ వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, పాటను రిలీజ్ చేస్తారని తాజా సమాచారం. కాగా, ఈ 'రేయ్' చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,