Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:53:36
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు చాలామంది ఇటు నాగచైతన్యను కాని.. అటు సమంతను కాని.. ఒక ప్రశ్న అడగాలని ఉవ్విళ్ళూరుతుంటారు. నిజానికి మెట్యూర్డ్ గా ఆలోచించనివారికే అటువంటి ప్రశ్నలు తడతాయి కాని.. సమంత మాత్రం వాటికి కూడా మెట్యూర్డ్ గా సమాధానం చెబుతోంది. ముఖ్యంగా అందరూ ఈమె సిద్దార్ద్ తో నడిపిన స్ర్టాంగ్ లవ్ ఎఫైర్ గురించే ప్రశ్నిస్తుంటారు. అలాగే నాగ చైతన్య కూడా ఒక హీరోయిన్ తో సాగించిన ప్రేమాయణం ఉంది. వీటన్నింటి గురించీ లేటెస్టుగా సమంత ''సౌత్ స్కోప్'' మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్యూలో విపులంగా చెప్పేసింది.

''మొదటి సినిమాలో కలసి పనిచేసినప్పటి నుండి మేం మంచి స్నేహితులం అయిపోయాం. నేను వేరే వారితో రిలేషన్లో ఉన్నప్పుడు తన నా ప్రక్కన ఉన్నాడు. అలాగే తను వేరే వారితో రిలేషన్లో ఉన్నప్పుడు నేను తన ప్రక్కన ఉన్నాను. సో ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియంది ఏదీ లేదు. మేమిద్దరం ఏమీ దాచుకోలేదు. ఒకరితో ఒకరం ఓపెన బుక్ లా ఉన్నాం. ఎందుకంటే అసలు మేము ఇలా రిలేషన్ స్టార్ట్ చేస్తాం అని మాకే తెలియదు కాబట్టి. సో మేం అబ్బే అలాంటి ఎఫైర్లు జరగలేదే అంటూ దాచుకునేదేం లేదిక్కడ'' అంటూ నవ్వేసింది సమంత.

అసలు ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారట? ''నిజానికి 2009 తరువాత మనం డేట్ చేద్దాం అని నేను అడిగినప్పుడు తన రెడీగా లేడు. అలాగే తను అడిగినప్పుడు నేను లేను. అయితే ఇప్పటికి ఇద్దరం కూడా.. ఒకరికి ఒకరం కావాలి అని ఒకేసారి ఫిక్స్ అయిపోయాం. చాలా బలంగా ఫిక్స్ అయిపోయాం'' అంటూ చెప్పేసింది. ఇప్పటికే నాగ చైతన్య కూడా సమంత గురించి ఆల్రెడీ ఓపెన్ గా అంతా చెప్పేశాడు. గుడ్ లక్ కపుల్!!

,  ,  ,  ,  ,  ,