Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2015 10:44:43
facebook Twitter Googleplus
Photo

జస్ట్ ఏభై నిమిషాల పాటు కనిపించినందుకు పవన్ కల్యాణ్ కు 15 కోట్లు ముట్టింది. ఈ ముచ్చట ఇటీవల రిలీజైన 'గోపాల గోపాల' చిత్రం విషయంలో చోటు చేసుకుంది. ఇందులో హీరోలుగా నటించిన పవన్, వెంకటేష్ లు పారితోషికం అంటూ ప్రత్యేకంగా ఏమీ తీసుకోలేదు. సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటాను కోరుకున్నారు. ఆ ప్రకారం చిత్రం మంచి బిజినెస్ చేయడంతో వీరికి లాభాల పంట పండింది. పవన్ కల్యాణ్ వాటాగా 15 కోట్లు, వెంకటేష్ వాటాగా 6.5 కోట్లు దక్కాయట. ఇక, నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన పవన్ మిత్రుడు శరత్ మరార్ కు 5 కోట్ల లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఏమైనా, ఎక్కువ కాల్ షీట్లు పనిచేయకుండానే ఈ సినిమా పవన్ కు భారీ మొత్తాన్ని తెచ్చిపెట్టింది!

,  ,  ,  ,  ,