Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 12:05:23
facebook Twitter Googleplus
Photo

కథానాయకుడిగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పవన్‌కల్యాణ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి క్లాప్ నిచ్చారు. ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఎస్.జె. సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్ పాత్ర చిత్రణ వినూత్న పంథాలో సాగుతుంది.
ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని హంగులు ఉంటాయి. రచయిత ఆకుల శివ? పవన్‌కల్యాణ్ శైలికి సరిపోయే చక్కటి కథను సిద్ధం చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు. రెండు పాటల రికార్డింగ్ పూర్తయింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఖుషి, కొమరం పులి తర్వాత పవన్‌కల్యాణ్, ఎస్.జె. సూర్య కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాలను మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళా దర్శకత్వం: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కథ, సంభాషణలు: ఆకుల శివ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య, నిర్మాత: శరత్‌మరార్.

,  ,  ,  ,  ,  ,  ,  ,