Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2016 14:10:53
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ.. ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 3 పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందట. టాకీ పార్ట్ కంప్లీట్ అవడంతో.. ఇక పాటలను షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ ప్రారంభం కానుంది.

గబ్బర్ సింగ్ లో టైటిల్ సాంగ్ కంటే అదుర్స్ అనిపించేలా ట్యూన్ ఇచ్చాడట దేవిశ్రీ ప్రసాద్. టైటిల్ సాంగ్ కాకుండా మరో రెండు పాటలను షూట్ చేయాల్సి ఉండడంతో.. ఇది పూర్తి కాగానే యూరోప్ టూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ఈ పాటలను షూటింగ్ చేయనున్నారు. వీటితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోనుంది. మొత్తానికి మార్చ్ మొదటి వారం చివరకు షూటింగ్ కంప్లీట్ చేసేయాలన్నది టార్గెట్ గా తెలుస్తోంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమైపోతాయి.

మార్చ్ మూడో వారంలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ పవన్ సినిమాకు జరగనంత వైభవంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 8న విడుదలకు ఇప్పటికే నిర్మాతలు డేట్ ప్రకటించగా.. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడిప్పుడే కన్ఫర్మేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.

,  ,  ,