Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 12:08:00
facebook Twitter Googleplus
Photo

జిల్ సినిమా డిజాష్టర్ అయినా కూడా.. టాలీవుడ్ కు ఒక స్టయిలిష్ విలన్ దొరికేశాడు. అతడి పేరు కబీర్ దుహన్ సింగ్. మామూలుగా అయితే కబీర్ తరహాలో హ్యాండ్సమ్ గా ఉండి కండలు తిరిగిన విలన్లు చాలామంది దొరుకుతారు. కాకపోతే వారిని మన దర్శకులు స్టయిలిష్ గా ప్రెజెంట్ చేస్తేనే వారికి కావల్సినంత బ్రేక్ వస్తుంది. అలా సోనూ సూద్ తరువాత ఇక్కడ మాంచి అవకాశాలు పట్టింది మాత్రం కబీర్ అనే చెప్పాలి.

అయితే మనోడు జిల్ ఇచ్చిన ఇంపాక్ట్ తరువాత.. అదే రేంజు క్రేజ్ మరోసారి తెచ్చుకోలేకపోయాడు. కాని 11 సినిమాల్లో నటించేశాడు. ఈలోపు టాలీవుడ్ తో ఆగకుండా పక్కనే ఉన్న తమిళ కన్నడ ఇండస్ర్టీల్లోకి కూడా వెళ్ళొచ్చాడు. మొన్న తమిళంలో వేదాళమ్.. నిన్న కన్నడలో హెబ్బులి.. ఇలా పెద్ద పెద్ద సినిమాలతో సక్సెస్ లు కొడుతున్నాడు. అయితే ఇప్పుడు తెలుగులో చేస్తున్న ఒక కొత్త సినిమాకు మాత్రం.. డబ్బింగ్ కూడా తనతోనే చెప్పిస్తానంటేనే సైన్ చేస్తా అన్నాడట.

పదకొండు తెలుగు సినిమాల్లో నటించాను.. నాకు వాయిస్ మాడ్యులేషన్ అండ్ పదాల ఉచ్ఛారణపై ఫుల్ గ్రిప్ వచ్చేసిందని చెప్పడంతో.. అశ్విన్ కుమార్ అనే నూతన దర్శకుడు అతను తీయబోయే సినిమాలో ఈ స్టయిలిష్ విలన్ స్టయిలిష్ లుక్ తో పాటు.. స్టయిలిష్ వాయిస్ ను కూడా వాడేసుకుంటారు

,  ,  ,  ,  ,