Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 11:02:18
facebook Twitter Googleplus
Photo

కోబలి.... కొన్నాళ్ల క్రితం బాగా వినిపించిన పేరిది. పైగా పవన్ కల్యాణ్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన టైటిల్ గా ఇది ప్రచారం పొందింది. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందనీ, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడనీ వార్తలొచ్చాయి. మధ్యలో మళ్లీ దాని ఊసే లేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఈ సినిమా టైటిల్ వార్తల్లోకి వచ్చింది. 'గబ్బర్ సింగ్ 2' తర్వాత తాను మరో రెండు సినిమాలు చేస్తానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో 'కోబలి' (రాయలసీమలో అమ్మవారికి జంతువులను బలివ్వడాన్ని కోబలి అంటారు) కూడా వుందని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ దాని తర్వాత ఈ 'కోబలి'పై వర్క్ చేయచ్చని సమాచారం. విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని పవన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తాడు.

,  ,  ,  ,  ,