Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2016 11:56:45
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీలో హైలైట్స్ అంటూ ఇప్పటికే చాలా రకాల న్యూస్ వచ్చాయి. డ్యాన్స్ నుంచి డైలాగ్స్ వరకూ పవర్ స్టార్ తన ట్రెండ్ చూపిస్తున్న విజువల్స్ ట్రైలర్స్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్ కి సంబంధించిన ఓ అప్ డేట్ లీక్ అయింది.

సర్దార్ లో ఇంటర్వెల్ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇక్కడ డైలాగ్స్ కూడా బాగా కుదిరాయట. ముఖ్యంగా పవన్ ఇచ్చే వార్నింగ్ టైప్ డైలాగ్ ఉందని టాక్. 'నిన్న మొన్న నాకు అనవసరం.. నేను వచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైమ్ మారాలి.. టైమ్ టేబుల్ మారాలి.' ఇదే సర్దార్ లో ఇంటర్వెల్ డైలాగ్ అంటున్నారు. చదవడానికే చాలా పవర్ ఉన్న ఈ డైలాగ్ ని.. పవన్ నోటి వింటే.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోతాయనే చెప్పాలి.

ఈ లీక్డ్ డైలాగ్ సినిమాలోదే అయినా.. దాని సెన్స్ మాత్రం వేరే అని అర్ధమవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను ఎంట్రీ ఇచ్చాక ఎలా ఉండాలో ముందే హెచ్చరికలు పంపుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ భూములు లాక్కోవడం లాంటి డైలాగ్స్ చర్చకు దారి తీశాయి. మరిప్పుడు పవన్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికనేది తెలియాలంటే.. ఏప్రిల్ 8వరకూ ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,  ,