Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2015 14:43:31
facebook Twitter Googleplus
Photo

బాహుబలి పార్ట్ 1 రిలీజై సంచలన వసూళ్లు సాధించేసింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసింది ఇప్పటికి. అయితే అంతటితో ఎస్.ఎస్.రాజమౌళి ఆగిపోలేదు. అతడు ఇంకా ఈ సినిమాతోనే యాత్ర కొనసాగిస్తున్నాడు.

ఇప్పటికీ బాహుబలి గురించి విదేశీ మార్కెట్లో విస్ర్తతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు చైనా జపాన్ మార్కెట్ల నుంచి వందల కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ వేశాడు. పీకే తర్వాత పీకే అంతటి సినిమా అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. అందుకు ఎంతో పట్టుదలతో ప్రమోషన్లో యాక్టివ్గా పాల్గొంటున్నాడు.

చైనా జపాన్లో బాహుబలి రిలీజ్ హక్కుల్ని కార్పొరెట్కు ఇప్పటికే భారీ మొత్తాలకు అమ్మేశారు. అంతటితో తన పని అయిపోయినట్టేనని రాజమౌళి అనుకోలేదు. తన సినిమా రిలీజ్ చేసే చోట తన ఫేస్ని కామన్ జనాలకు కూడా పరిచయం చేస్తున్నాడు. చూడగానే ఫలానా దర్శకుడు అని చెప్పుకునేలా ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా బాహుబలి 2 సెట్స్కెళ్లే ముందు.. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితినే క్రియేట్ చేస్తోంది.

వాస్తవానికి బాహుబలి: ది కన్క్లూజన్ షూటింగ్ నవంబర్లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాజమౌళి ఇంతవరకూ దానికి సంబంధించి ఏ క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ - రానా - అనుష్క సైతం ఇప్పటికీ శరీరాకృతిని తీర్చిదిద్దుకుంటున్నట్టు కనిపించలేదు. దీనర్థం బాహుబలి 2 ఆలస్యంగా సెట్స్కెళుతుందనే.

ఇప్పటికే 2016 ప్రథమార్థంలో రిలీజైపోతుందని అనుకున్నారు.. కానీ ఇలా జక్కన్న ఆలస్యం చేస్తుంటే అది ఏడాది చివరి వరకూ పాజిబుల్ కాదనే అనిపిస్తోంది. ఎలా చూసినా 2వ పార్టు రిలీజ్ కు బ్యాండు పడుతోంది. జక్కన్న ఏం చేస్తాడో మరి?

,  ,  ,