Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:37:00
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడూ కంప్లీట్ అవుతుందో పవన్ కు తప్ప ఇంకెవరికీ తెలియదంటూ కామెంట్ చేస్తారు పవర్ స్టార్ ని వ్యతిరేకించే వాళ్లు. అయితే ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు మౌత్ ని కాస్త కంట్రోల్ లో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మూవీస్ ని ఫినిష్ చేసే విషయంలో పవన్ స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు.

వచ్చే రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తా అన్నాడు పవన్. అనడమే కాదు అంతే వేగంగా చేతిలో ఉన్న సినిమాల్ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు లేనిది ఒకటికి మూడు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టాడు. ఓ వైపు కాటమరాయుడు చేస్తూనే.. త్రివిక్రమ్ తో ఓ సినిమా.. ఏఎం రత్నంకి మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలు మొదలయ్యే లోపు సెట్స్ మీదున్న కాటమరాయుడిని అనుకొన్న షెడ్యూల్ ప్రకారం చకచకా పూర్తి చేసేస్తున్నాడు.

ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఇక్కడ షూట్ చేసి తర్వాత పొల్లాచ్చి వెళతారు. సాంగ్స్.. ఒకట్రెండు సీన్స్ మినహాయిస్తే ఓవరాల్ గా జనవరికి కాటమరాయుడు కంప్లీటైపోతుందని టాక్. అంటే ప్యాచ్ వర్క్.. పోస్ట్ ప్రొడక్షన్ అంటూ ఇంకో నెల రోజులు అటు ఇటైనా సమ్మర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్న కాటమరాయుడు ఆ టైమ్ కి పక్కా రెడీ అయిపోతుంది. అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోవచ్చు.

,  ,  ,  ,  ,