Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 13:08:30
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అతని కాళ్ళు మొక్కేవారిని చూసాం..కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా వేరే వ్యక్తి కాళ్ళు మొక్కడం ఇప్పుడే చూస్తున్నామని అంటున్నారు అభిమానులు..ఇంతకీ పవన్ ఎవరి కాళ్ళు మొక్కాడు..? ఆ అవసరం ఏమొచ్చింది..? అనేది ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కాకినాడ లో పవన్ కళ్యాణ్ జనసేన సభ ఏర్పటు చేసిన సంగతి తెల్సిందే..ఈ సభ కోసం పవన్ ఓ రోజు ముందే కాకినాడ కు చేరుకున్నాడు. కాగా కాకినాడలోని చంద్రశేఖర్ ఆసుపత్రి కి వెళ్లిన పవన్ కళ్యాణ్ , డాక్టర్ చంద్రశేఖర్ కాళ్ళు మొక్కడం అందర్నీ ఆశ్ఛర్యం కలిగించింది.

ప్రముఖ కంటి డాక్టర్ చంద్రశేఖర్, ఈ మధ్యనే తన భార్య , కొడుకును పోగుట్టుకున్నాడట..అయినప్పటికీ తన మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు . అతడి సేవాభావం గురించి తెలుసుకున్న పవన్ ఉప్పొంగిపోయి ఉద్వేగంతో డాక్టర్ చంద్రశేఖర్ కాళ్ళు మొక్కడం జరిగిందట. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు పవన్ మంచితనం గురించి గొప్పగా సోషల్ మీడియా లో చెప్పుకుంటున్నారు

,  ,  ,  ,  ,  ,