Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:40:06
facebook Twitter Googleplus
Photo

సినిమాలు సెంచరీలు కొట్టడం.. సిల్వర్ జూబ్లీలు ఆడ్డం లాంటివి చూసి చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడంతా బడ్జెట్ తోనే కొత్త రికార్డులు సృష్టించేస్తున్నారు. 50.. 60 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు సాధారణం అయిపోతోంది. రెండంకెల స్థాయి దాటి.. టాలీవుడ్ పరిశ్రమ మూడంకెలకు దూసుకుపోతోంది.

ప్రస్తుం షూటింగ్ చివరిదశకు చేరుకున్న మహేష్ బాబు మూవీ స్పై డర్ ను 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాహుబలి ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహో కు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 30 కోట్లు కేటాయిస్తారని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసినీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

పవర్ స్టార్ తో మూవీని ప్రతిష్టాత్మంగా తీసుకున్న నిర్మాతలు.. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ముందుగా అనుకున్న మొత్తం కంటే ఇప్పుడు ఓ 20 శాతం ఫిగర్ పెంచేశా. బాహుబలి కోసం 450 కోట్ల బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,