Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Oct-2017 16:50:26
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కోసం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా ఎదురుచూస్తోందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టి చాలా కాలమే అవుతోంది. దీంతో ఈ సారి వచ్చే ఈ కాంబినేషన్ తప్పకుండా హిట్ అవ్వడం ఖాయమని ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది 25వ చిత్రం కావడం మరొక విశేషమని చెప్పాలి.

అయితే ఈ చిత్ర యూనిట్ రీసెంట్ గా బ్యాంకాక్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొని వచ్చింది. ప్రస్తుతం మరి కొన్ని ముఖ్యమైన సీన్స్ కోసం త్రివిక్రమ్ యూనిట్ కర్ణాటక లోని చిక్ మగలూర్ వెళ్లనుంది. అక్కడ హిల్ స్టేషన్ లో ముడు రోజుల పాటు చిత్రీకరణను జరిపి ఆ వెంటనే నెక్స్ట్ మంత్ యూరోప్ లో మరికొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ తో దాదాపు సినిమా ఏండింగ్ కి వచ్చేస్తోంది. అప్పటివరకు చిత్ర యూనిట్ చాలా బిజీ అని చెప్పాలి. మొత్తంగా సినిమా షూటింగ్ నవంబర్ చివరివరకు పూర్తి చేసుకుంటుందని టాక్.

ఈ సినిమాకి ఆజ్ఞతవాసి అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. అభిమానులకు కూడా చాలావరకు ఈ పేరు నచ్చింది. దీంతో చిత్ర యూనిట్ కూడా అదే టైటిల్ ను పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్ గా కీర్తి సురేష్ - అను నటిస్తుండగా ముఖ్య పాత్రల్లో అది పినిశెట్టి మరియు కుష్బూ కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,