Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 14:36:59
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం.. ఏ భామ అయినా కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ ఉంటుంది. డిజాస్టర్ భామలు.. ఐరన్ లెగ్ పోరీలకు కూడా పవన్ బ్రేక్ ఇచ్చేయగలడు. పవర్ స్టార్ తో ఓ సినిమా చేస్తే.. అసలు సెలెక్ట్ అయితే చాలు.. ఆ తర్వాత ఛాన్సుల వరద ఎలా ఉంటుందో చాలామందికే తెలుసు. అందుకే ఇంత హంగామా నడుస్తుంటుంది.

ఐరన్ లెగ్ అని అన్ని ఇండస్ట్రీలలోను బ్రాండ్ వేయించుకున్న శృతి హాసన్ కి.. గబ్బర్ సింగ్ తో బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోయిన్ ని చేసిన పవన్ కళ్యాణ్.. నయనతార అంటే మాత్రం నో చెప్పేస్తున్నాడట. కాటమరాయుడు.. త్రివిక్రమ్ రూపొందించే చిత్రాలతో పాటు.. పవర్ స్టార్ మరో సినిమా కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. వేదాళం రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం.. హీరోయిన్ ను ఎంపికలో భాగంగా.. నయన తార పేరును పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. కాంబినేషన్.. గెటప్పుల మ్యాచింగ్ లాంటివి పరిశీలించి డెసిషన్ తీసుకునే పవన్ కళ్యాణ్.. నయన్ పేరు చెప్పగానే నో చెప్పేశాడని తెలుస్తోంది.

తమిళ్ రీమేక్ కావడంతో.. తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న నయన్ ను తెచ్చుకుందామని.. తమిళ నిర్మాత ఏఎం రత్నం- తమిళ దర్శకుడు ఆర్ టి నీసన్ అనుకున్నారని టాక్. అయితే.. తెలుగులో ఈమె మాత్రం ఐరన్ లెగ్గే. అనామిక.. బాబు బంగారం.. నేనూ రౌడీనే వంటి చిత్రాలన్నీ ఇక్కడ బోల్తా కొట్టేశాయి. డైరెక్ట్.. రీమేక్ లతో సంబంధం లేకుండా నయన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నయన్ కి పవన్ కి నో చెప్పాడని టాక్!

,  ,  ,  ,  ,