Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 11:56:52
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతుండగా.. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి #PSPK25 అంటూ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికలలోపు పవన్ కు ఇది ఆఖరి చిత్రం అనే ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. దీంతో నిర్మాత ఎస్. రాధాకృష్ణ ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే భారీగా వెచ్చించేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనదే ఓ ఇంటి సెట్ లో అని గుర్తు చేసుకోవాలి. ఈ సెట్ నిర్మాణం కోసం 4.5 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు మొదట ప్రచారం జరిగింది. దీంతో పాటు మరికొన్ని సెట్స్ కోసం కోట్ల కొద్దీ సొమ్ములు కురిపించేస్తున్నారట. ఓ టెర్రస్ సెట్ కోసమే కోటిన్నర ఖర్చు చేశారన్నది లేటెస్ట్ టాక్. దుబాయ్ లో కనిపించే బహుళ అంతస్తుల భవనం టెర్రస్ మాదిరిగా ఈ సెట్ ఉంటుందట. ఇక్కడ తీయాల్సిన సీన్స్ కొన్నే అయినా.. ఆయా సన్నివేశాలకు ఉన్న ఇంపార్టెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత మొత్తాన్ని ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మరోవైపు పవన్ ఆఫీస్ సెట్ కోసమే 3 కోట్లు వెచ్చించారని తెలుస్తోంది.

మరోవైపు పవర్ స్టార్ సినిమాలో గ్రాఫిక్స్ ను విస్తృతంగా ఉపయోగించనున్నారని అంటున్నారు. సూర్య మూవీ 24 కోసం వర్క్ చేసిన గ్రాఫిక్స్ టీం.. పవన్-త్రివిక్రమ్ సినిమాకి పని చేయనున్నారు. బాహుబలి సినిమాలో కనిపించే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

,  ,  ,  ,  ,