Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Aug-2017 13:37:56
facebook Twitter Googleplus
Photo

ఎంత మంది టాప్ హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువే అని చెప్పాలి. సినిమాలకన్న వ్యక్తిగతంగానే ఎక్కువ అభిమానులను గెలుచుకున్న పవర్ స్టార్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో నడుచుకుంటున్నాడు. అయితే కటమరాయుడు తర్వాత తను తీయబోయే 25వ సినిమాపై భారీ అంచనాలు అలుముకున్నాయి.

పైగా ఆ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండడంతో అభిమానాలు ఆ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కి టైటిల్ ఇదేనని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందులో మొదటగా ఇంజనీర్ బాబు.. గోకుల కృష్ణుడు.. దేవుడే దిగి వచ్చినా.. అంటూ చాలా పేర్లు వినిపించాయి. మొన్నామధ్యన చుట్టేద్దాం రారండోయ్ అనే టైటిల్ కూడా విన్నాం. ఇక లేటెస్ట్ గా మరో కొత్త టైటిల్ ఇదేనంటు ప్రచార సాగుతోంది.

ఈ సినిమాకు రాజు ఒచ్చినాడు అని త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా చిత్ర యూనిట్ ని నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర నిర్మాత రాధాకృష్ణ. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యూల్ నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,