Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2015 16:17:46
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ను అభిమానులు దేవుడిగా కొలవడం కొత్తేమీ కాదు. కమెడియన్ షకలక శంకర్ లాంటి వాడే పవర్ స్టార్ ను దేవుడిగా భావించి.. అతడికి గుడి కూడా కట్టించేస్తున్నాడు. ఇప్పుడు పవన్ దేవుడికి ఇంకా పెద్ద భక్తుడు దొరికాడు. అది మరెవరో కాదు.. కోన వెంకట్. ఇంతకుముందోసారి పవన్ తన ?సోల్ మేట్? అని చెప్పుకున్న కోన.. తాజాగా పవర్ స్టార్ తనకు దేవుడి లాంటి వాడని చెప్పాడు. ?శంకరాభరణం? ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా కోన ఈ వ్యాఖ్యలు చేశాడు. కోన లాంటి స్టార్ రైటర్ పవన్ తన దేవుడని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

పవన్ మీద తన అభిమానాన్ని చాటుకోవడానికి కోన ఎప్పుడూ వెనకడాలేదు. తనకు పవన్ కు ఉన్న అనుబంధం గురించి చాలా మందికి తెలియదని.. తాను ఎప్పుడు కథతో వెళ్తే అప్పుడు తన దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్ సిద్ధంగా ఉంటాడని గతంలో చెప్పాడు కోన. పవన్ తో కోన ఒక్క సినిమాకే పని చేశాడు. రైటర్ గా స్టార్ స్టేటస్ సంపాదించకముందే ?బాలు? సినిమాకు మాటలు అందించాడు. మళ్లీ ఎప్పుడూ వీళ్లిద్దరూ కలిసి పని చేయలేదు. ఈ మధ్యే కోన మీద ఉన్న అభిమానంతో ?సర్దార్ గబ్బర్ సింగ్? సెట్ లో ?శంకరాభరణం? టీజర్ రిలీజ్ చేశాడు పవన్. సెప్టెంబరులో పవన్ పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు కోన.

,  ,  ,