Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2015 10:47:09
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ షూటింగుకి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29 నుంచి ఆయన మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడు. బాబీ (కెయస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందే 'గబ్బర్ సింగ్ 2' చిత్రం కోసం పవన్ రెడీ అవుతున్నాడు. ఈ షూటింగ్ కోసం లొకేషన్ల ఎంపికకు వెళ్లిన దర్శకుడు, కెమెరామేన్ పూణే సమీపంలోని కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారట. దాంతో 29 నుంచి పూణే దగ్గరలోని ఓ గ్రామంలో ఈ షూటింగును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చే ఈ సినిమాలో పవన్ సరసన ఓ కథానాయికగా అనీషా ఆంబ్రోస్ ను ఎంచుకున్న సంగతి విదితమే!

,  ,  ,  ,  ,  ,