Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2016 15:09:24
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెళ్ళిచూపులు అనే చిన్న సినిమా రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటివారాంతమే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. తెలుగులో టాప్ చానల్స్ అన్ని సాటిలైట్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి.
కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ రైట్స్ సుమారుగా 3 కోట్ల వరకూ పలకొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరి ఈ హక్కులను ఏ చానల్ సొంతం చేసుకుంటుందనేది చూడాలి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.

,  ,  ,  ,  ,