Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2017 11:44:57
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోకైనా ఎప్పుడో ఒకప్పుడు కెరీర్ లో ఫెయిల్యూర్స్ రాక తప్పదు. ఎన్ని హిట్స్ వచ్చినా కూడా ఒక్క సినిమాతో బారి ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ప్రతి కథను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను తీసిన రవితేజ ఇప్పుడు కాస్త కష్టకాలంలోనే ఉన్నాడు.

చేతిలో ఉన్న సినిమా దాదాపు ఆగిపోయే స్థితిలోకి వచ్చేసింది. ప్రస్తుతం దిల్ రాజు సపోర్ట్ తో రాజా ది గ్రేట్ అనే సినిమాను పూర్తీ చేశాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే దీనికంటే ముందే ఒకే చేసిన టచ్ చేసి చూడు మాత్రం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అయితే ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో అసలు నిజం బయటికి రాలేదు. ఆ సినిమా దర్శకుడు విక్రమ్ సిరికొండ టేకింగ్ నచ్చక రవితేజనే ఆపేసాడని కామెంట్స్ వినిపించాయి. కానీ రీసెంట్ గా ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సీరత్ కపూర్ ఒక వివరణ ఇచ్చింది.

రాజు గారి గది 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీరత్ టచ్ చేసి చూడు సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఆ సినిమాలో నా పాత్ర చాల కొత్తగా ఉంటుందని చెప్పింది. కథను మలుపు తిప్పే పాత్రలో తాను కనిపిస్తానని చెప్పడంతో సినిమా ఇంకా సెట్స్ పైనే ఉందని ఓ క్లారిటీ ఇచ్చేసింది.

,  ,  ,  ,