Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 11:53:13
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో సందీప్ కిషన్ తెగ ఫోటో షూట్స్ చేసేస్తూ ఉంటాడు. హీరోయిన్స్ అంటే.. ఛాన్సుల కోసమో.. మేగజైన్ కవర్ పేజ్ ల కోసమో ఫోటో షూట్స్ చేయడం కామన్. కానీ సందీప్ కిషన్ మాత్రం.. రకరకాల స్టైలింగ్ తో డిఫరెంట్ పోజులతో ఫోటో షూట్స్ చేసి షేర్ చేస్తూ ఉంటాడు.

అయితే.. ఇలా ఫోటో షూట్స్ తో అభిమానులతో టచ్ లో ఉండడం మంచి విషయమే అంటున్న ఇండస్ట్రీ జనాలు.. సినిమాల ఎంపికలో మాత్రం సందీప్ కిషన్ అంతగా ట్యాలెంట్ చూపించడం లేదని అంటున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత.. ఇప్పటివరకూ మరొక హిట్ కొట్టడంలో సందీప్ కిషన్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాటిలో కొన్ని మంచి సినిమాలు ఉన్నా.. రిలీజ్ టైమింగ్ విషయంలో తేడా రావడంతో.. వాటికి టాక్ బాగున్నా వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయాయి.

ఇదే సమయంలో నాని.. నిఖిల్.. రాజ్ తరుణ్.. విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మంచి థీమ్ లతో డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుని మినిమం గ్యారంటీ హీరోల రేంజ్ నుంచి ప్రామిసింగ్ అనిపించేసుకున్నారు. కానీ సందీప్ కిషన్ అడుగులు మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీతో చేస్తున్న నక్షత్రంపై సందీప్ కిషన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. తమిళ్ లో కూడా మంచి ప్రాజెక్టులే ఈ కుర్రాడి చేతిలో ఉన్నాయి.

,  ,  ,  ,