Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 10:43:23
facebook Twitter Googleplus
Photo

పరాయి భాషకు చెందిన ఓ హీరో సినిమా హిట్ అయితే చాలు.. వరుసగా ఆ హీరోకి చెందిన డబ్బింగ్ బొమ్మలు దిగిపోతూ ఉంటాయి. ఇక సక్సెస్ ఫుల్ టైటిల్స్ లెక్క కూడా ఇలాగే ఉంటుంది. తెలుగులో పిజ్జా మూవీ సక్సెస్ కావడంతో.. ఆ స్టోరీతో సంబంధం లేకపోయినా.. పిజ్జా2 అనే చిత్రం మరొకటి డబ్బింగ్ అయిపోతోంది.

పురియాత పుతిర్ అనే టైటిల్ పై వచ్చిన చిత్రాన్ని.. తెలుగులో పిజ్జా2గా తీసుకొస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా.. గాయత్రి హీరోయిన్ గా నటించగా.. రంజిత్ జెయకోడి డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడీ పిజ్జా2 ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్ పరంగా బాగానే ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ మామూలే అయినా.. ఆ అమ్మాయిని దెయ్యం వెంటాడుతోందని అనుమానిస్తుంటాడు హీరో. సినిమా అంతా అనుమానంగానే తిరుగుతూ ఉంటాడు. అయితే. నిజానికి ఇలా వెంటాడేది ఆ హీరోనే అనే విషయం తెలుసుకోలేడు.

కాన్సెప్ట్ మాత్రమే కాదు.. సినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుందనే విషయం విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. దీనికి తోడు పిజ్జా2 అనే టైటిల్ ఆసక్తి కలిగిస్తోంది. మరి.. రిజల్ట్ ఎలా ఉండనుందో?

,  ,  ,  ,  ,