Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 15:34:18
facebook Twitter Googleplus
Photo

కేవలం విజువల్ చూస్తే కిక్ రాదు. సినిమాను ఎప్పుడూ సౌండ్ తో కలిపే చూడాలి. రెండూ ఇచ్చిన కిక్ వేరే ఉంటుంది కదా. సౌండ్ కి ఉన్న ప్రాముఖ్యత అలా ఉంది మరి. ఆ లెక్కన తెలుగు సినిమాకు గర్వకారణం అయిన బాహుబలికి ఎంత జాగ్రతలు తీసుకోవాలి? బాహుబలికి పనిచేసిన సౌండ్ డిజైనర్ నేషనల్ అవార్డ్ గ్రహీత పి ఏం సతీష్ తన బాహుబలి అనుభవాలు ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.

ముందుగా రాజమౌళి విజన్ ఇండియాలో ఇంత వరుకు ఎవ్వరు ఊహించని ఒక ఫిల్మ్ మేకింగ్. అతని బెంచ్ మార్క్ చేరుకోవాలి౦టే చాలా కష్టం. రాజమౌళి యార్లగడ్డ శోభ చూపించిన క్రమశిక్షణ వలనే బాహుబలి సౌండ్ ఇంత గొప్పగా రావడానికి కారణం. నేను చాలా హింది ఫిల్మ్స్ లో పనిచేశా కానీ టాలీవుడ్ లో ఉన్నంత క్రమశిక్షణ బాలీవుడ్ లో లేదు అంటూ ఏకంగా సతీష్ బాలీవుడ్ పైనే సెటైర్లు వేసేశాడు.

రాజమౌళి క్వాలిటి కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే.. ఒక సీన్ ఎడిటింగ్ అయిపోయాక ఒక దగ్గర గ్రాఫిక్స్ వర్క్ తన ఊహించిన స్థాయిలో రాకపోతే..ఏకంగా ఆ సీన్ ని సినిమా నుండి తొలిగించారు. అంతా సాహసం ఎవరు చేస్తారు? ఈ సినిమాకు ఫలానిది కావాలి అంటే అది మా దగ్గర తక్షణమే అందేలా చూసుకున్నారు. అనవసర చర్చలు అస్సలు చేయరు. టెక్నీషియన్ అభిప్రాయానికి విలువనిస్తారు అంటూ చెప్పాడు.

బాహుబలి కోసం డాల్బీ అట్మోస్ సౌండ్ తో సౌండ్ డిజైన్ చేశారట. దీని వలన త్రీడి స్పేస్ లో సౌండ్ కూడా క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు సతీష్ దీల్లి బెల్లి ఫేమ్ డైరెక్టర్ అక్షత్ వర్మా కొత్త మూవీకి సౌండ్ డిజైన్ చేయనున్నాడు. ఈ సినిమా లో సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,