Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2017 15:04:07
facebook Twitter Googleplus
Photo

సినిమాతో సుకుమారంగా కనిపించి ఒక్కసారిగా డీజే సినిమాలో బికినితో అదరగొట్టిన భామ పూజ హేగ్దే. చేసింది కొన్ని సినిమాలే అయినా పూజ ఈ మధ్య తెగ పాపులారిటీని సంపాదించుకుంది. టాలీవుడ్ లో హిట్స్ అందుకుంటే ఈజీగా స్టార్ హోదాను అందిపుచ్చుకోవచ్చు అనుకుంటుందో ఏమో గాని తెలుగు ప్రేక్షకులకు కొంచెం దగ్గరవ్వడానికి బాగానే కష్టపడుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న లాట్ మొబైల్ సంస్థ కు చెందిన మొబైల్ షోరూమ్ ను విజయవాడలో లాంచ్ చేసింది.

అయితే అక్కడకు వెళ్లిన ఈ భామ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. వారి అభిమానానికి సంతోష పడిపోయి సెల్ఫీలను కూడా దిగింది. ఇక అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా పూజ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేసింది. అయన ఆంధ్రప్రదేశ్ మైకేల్ జాక్సన్ అంటూ..డాన్స్ లో ఆయనకు పోటీ ఎవరులేరని చెప్పింది. ఇక అల్లు అర్జున్ తో డీజే సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ.. మరో సారి నటించే అవకాశం వస్తే స్క్రిప్ట్ కూడా చూడనని వాగ్దానాలు చేసేస్తోంది పూజ.

ఇక దువ్వాడ జగన్నాథమ్ సినిమా అంతగా ఆడకపోయినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకుంటున్నారని టాక్ ఉంది. కానీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పూజకి మాత్రం మంచి ఆఫర్స్ దక్కుతున్నాయట. బాలీవుడ్ తో పాటు మహేష్ - ప్రభాస్ వంటి హీరోల నెక్స్ట్ సినిమాల్లో ఈ అమ్మడికి ఛాన్స్ దొరికిందని టాక్.

,  ,  ,  ,  ,