Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 13:10:30
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యన కొత్తగా ఎవరన్నా అనవసరంగా పొగిడేసి అవతలవారిని శతవిధాలా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. వెంటనే బిస్కెట్లు వేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ బిస్కెట్ బాషలో చెప్పుకుంటే.. ఇప్పుడు డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే జస్ట్ ఏదో బిస్కెట్లు వేయడం కాదు.. ఏకంగా ఒక బిస్కెట్ల ఫ్యాక్టరీయే కట్టేసింది. అదెలా అంటారూ.. ఓసారి డిజె దువ్వాడ జగన్నాథమ్ ఆడియో లాంచ్ వైపు లుక్కేసుకోండి.

ఇప్పటికే గుడిలో బడిలో సాంగ్ టీజర్ దెబ్బకి ఈమె సెక్సీ లుక్స్ తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ళకు చెక్కిలిగింతలు పెట్టేశాయి. ఆల్రెడీ ఓ రేంజు పాపులార్టీ తెచ్చుకున్న ఈ భామ.. డిజె ఆడియో లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. అసలు మా దర్శకుడు హరీశ్ శంకర్ సార్ వేసే జోకులు చాలా అద్భుతంగా ఉంటాయని.. షూటింగ్ అయ్యాక కూడా వాటిని తలుచుకుని తెగ నవ్వుకుంటా అని చెప్పింది. పైగా ఆయన సార్ అని పిలవొద్దు అని చెప్పినా కూడా ఈమె మాత్రం సార్ అనకుండా ఉండలేకపోతోందట. ఇక దిల్ రాజు గురించి చెబుతూ.. ఆయన అసలు యాక్టర్ అయితే బాగుంటుంది.. అంత గుడ్ లుక్స్ పెట్టుకుని ఎందుకు హీరో అవ్వలేదో నాకర్దం కావట్లేదు అని చెప్పింది. పైగా హరీశ్ అండ్ దిల్ రాజు తనకు ఇలాగే ఇంకా ఛాన్సులు ఇస్తే సూపర్ అంటోంది. ఇక బన్నీ అయితే చాలా యాక్టింగ్ టిప్స్ ఇచ్చాడట.. డ్యాన్సుల్లో కేకలు పెట్టించాడట. అలాగే తెలుగు ప్రేక్షకులు చాలా క్రేజీ ఫ్యాన్స్ అని.. అందుకే బాలీవుడ్ లో బిజీగా ఉన్నా కూడా మధ్యలో తెలుగు కోసం ఇటొస్తున్నట్లు చెప్పింది. ఈసారి వచ్చేటప్పటికీ తెలుగు నేర్చుకుంటుందట.

,  ,  ,  ,  ,  ,