Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2015 11:19:11
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ తెరపై భారీ సౌందర్యాన్ని ఆవిష్కరించే తారగా సన్నిలియోన్ కనిపిస్తుంది. అందాల తారగా ... శృంగార దేవతగా ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సన్నీలియోన్ ఉంటే చాలు .. కథా కథనాలు ఎవరికి కావాలి? అనుకునేవాళ్లు లేకపోలేదు. ఇక తెలుగు సినిమాలు చేస్తోన్న హాలీవుడ్ హీరోలా 'రానా' కనిపిస్తుంటాడు. కండలు తిరగిన శరీరంతో ఆకర్షిస్తూ .. ప్రాధాన్యతగల పాత్రలను చేస్తూ వస్తున్నాడాయన. ఆయన పర్సనాలిటీకి తగిన పాత్రలతో బాహుబలి .. రుద్రమదేవి సినిమాలతో త్వరలో ప్రేక్షకులముందుకి రానున్నాడు.

తాజాగా ఒక హిందీ సినిమాలో 'టార్జాన్'తరహా పాత్రలో రానా కనిపించనున్నాడట. ఇక ఆయన జోడీగా సన్నిలియోన్ అలరించనుంది. కథాపరంగా ఈ ఇద్దరిమధ్య అదుర్స్ అనిపించే స్థాయిలో రొమాన్స్ ఉంటుందని సమాచారం. బాలీవుడ్లో తెరకెక్కనున్న ఈ సినిమా, ఆ తరువాత తెలుగులోను అనువాదంగా అడుగుపెడుతుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

,  ,  ,  ,  ,