Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 11:36:21
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ జనాలే కాదు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. జూన్ నుంచి భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు రాజమౌళి సిద్ధం అవుతుండగా.. మెయిన్ విలన్ భల్లాలదేవ పాత్రధారి రానా కూడా యూనిట్ తో జత కానున్నాడు. ఇక జూలై నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బాహుబలి2 షూటింగ్ లో పాల్గొనబోతోందని తెలుస్తోంది.

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో.. అవంతికగా కనిపించింది తమన్నా. ఈమెది నిజానికి ఓ యువరాణి పాత్ర. ఆమె ఎందుకు బందిపోటు మాదిరిగా మారింది వంటి డీటైల్స్ బాహుబలి2లో వెల్లడి కావాల్సి ఉంది. అయితే.. ఈ సీక్వెల్ లో తమ్మూ పాత్ర అంత లెంగ్తీగా ఉండే ఛాన్స్ లేదన్న మాట సుస్పష్టం. అయితే.. కనిపించినంత సేపు తమన్నా గ్లామర్ డోస్ పీక్ స్టేజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

జూలైలో బాహుబలి2 యూనిట్ తో తమ్మూ జతయ్యాక.. మొదట కొన్ని యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతోంది. ఆ తర్వాత ప్రభాస్ - మిల్కీల మధ్య ఓ రొమాంటిక్ డ్యూయెట్ పిక్చరైజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ లో సెన్సేషన్స్ తో పాటు కాంట్రవర్సీలు కూడా మోసుకొచ్చిన 'పచ్చబొట్టేసిన' పాటకు మించి.. బాహుబలి2లో గ్లామర్ గా కనిపిస్తుందట తమన్నా. బాహుబలి2లో తను కనిపించేది కాసేపే అయినా.. ఉన్నంతలో అటెన్షన్ డ్రా చేయడానికి రెడీ అయిపోతోంది తమ్ము. మరి ఈ సారి ఎన్ని వివాదాలను తెచ్చుకుంటుందో!

,  ,  ,  ,  ,  ,  ,