Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2016 11:53:20
facebook Twitter Googleplus
Photo

బాహుబలి తర్వాత తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి నోరు విప్పాడు. తనకు హిందీ నుంచి పెద్ద ఆఫర్లే వచ్చినట్లు అతను తెలిపాడు. కానీ ఆ ఆఫర్లేవో మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఐతే ఆ మధ్య ప్రచారం జరిగినట్లుగా ?ధూమ్-4? కోసం తనను అడిగారన్న మాట నిజం కాదని ప్రభాస్ చెప్పాడు.

??బాలీవుడ్ నుంచి నాకు కొన్ని మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ యశ్ రాజ్ వాళ్లు ధూమ్-4 కోసం అడిగారన్నది నిజం కాదు. ?బాహుబలి? చేస్తుండటంతో బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచించలేదు. దీని తర్వాత నేను మా హోం ప్రొడక్షన్లో రెండు సినిమాలు చేస్తున్నాను. అవి రెండు బైలింగ్వల్ సినిమాలు. హిందీ సినిమాలు చేయకూడదన్న ఆలోచన లేదు. ?బాహుబలి? తర్వాత చేయబోయే రెండు సినిమాలూ పూర్తయ్యాక మంచి ఆఫర్లేవైనా వస్తే ఆలోచిస్తాను. ప్రస్తుతానికి బాలీవుడ్లో ఏ సినిమా కమిటవ్వలేదు?? అని ప్రభాస్ చెప్పాడు.

ఇక తన పుట్టిన రోజుకు రాజమౌళి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడమే అని.. ఈ పోస్టర్ చూసి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానని ప్రభాస్ అన్నాడు. ఐతే దీని కంటే ముందు రాజమౌళి తనకెన్నో బహుమతులు ఇచ్చాడని తెలిపాడు. బాహుబలి-2 టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని.. అది అందరికీ చాలా నచ్చుతుందని ప్రభాస్ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,