Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 13:22:13
facebook Twitter Googleplus
Photo

తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ చాలాకాలం తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన బాబు బంగారం చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు. గతంలో వెంకీ నటించిన దృశ్యం చిత్రం ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మళయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ?దృశ్యం? ఆధారంగానే తెలుగులోనూ రీమేక్ చేశారు.
ఇప్పుడు వెంకీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే జీతూ జోసెఫ్ వెంకీకి కథ చెప్పాడని, వెంకీ కూడా కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకురమ్మని జోసెఫ్ కు చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకీ తమిళ సినిమా ?ఇరుద్ది సుత్తురు? ను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

,  ,  ,  ,  ,