Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Dec-2017 12:55:41
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ చేస్తోన్న సాహో సినిమాపైన ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్లో ప్రభాస్ మార్కెట్ పెరిగిపోయింది. దీంతో సినిమా చాలా రిచ్ గా ఉండాలని చిత్ర యూనిట్ చాలా కష్టపడుతోంది. బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ప్రభాస్ కూడా తెగ కష్టపడుతున్నాడు. యువ దర్శకుడు సుజీత్ కూడా ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం కొంచెం రెస్ట్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో దుబాయ్ లో కొన్ని యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి సాహో టీమ్ రెడీ అవుతోంది. అయితే ముందుగా అనుకున్న డేట్ ప్రకారం కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ పూర్తవ్వకపోవచ్చు అనే టాక్ బాగా వినిపిస్తోంది. సినిమాలో ఎక్కువగా నార్త్ కు చెందిన నటీనటులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ప్రముఖ నటుడు షెడ్యూల్ కారణంగా సినిమా ఆలస్యంగా స్టార్ట్ అవబోతోందని టాక్ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ - శ్రద్ధా కపూర్ - మందిరా బేడి వంటి బాలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలను పోషిస్తున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

అయితే మొదట సినిమాను నెక్స్ట్ ఇయర్ దసరా కానుకగా రిలీజ్ చేస్తామని యూవీ క్రియేషన్స్ చెబుతూ వస్తోంది. కానీ ఇప్పుడు అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అనే టాక్ బాగా వినిపిస్తోంది. సినిమా ఎంత త్వరగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ తో కూడుకున్న సీన్స్ సినిమాలో హైలెట్ కాబట్టి గ్రాఫిక్స్ పనులకు టైమ్ పట్టొచ్చు.

,  ,  ,  ,  ,