Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2014 10:27:29
facebook Twitter Googleplus
Photo

ఎవరూ ఊహించని విధంగా, చాలా విచిత్రంగా ఈ రోజు రిలీజైన 'యాక్షన్ జాక్సన్' హిందీ చిత్రంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రత్యక్షమై ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ చిత్రంలో ఓ పంజాబీ పాటలో సోనాక్షి సిన్హాతో కలసి ఫాస్ట్ మూమెంట్స్ తో ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. పన్నెండు సెకండ్ల సేపు ఈ పాటలో ప్రభాస్ దర్శనమిస్తాడు. ప్రభుదేవాతో వున్న అనుబంధం వల్లే ఇందులో తను నటించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో ప్రభాస్ నటించిన విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు.

,  ,  ,  ,  ,