Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2016 15:31:51
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలకు డ్యాన్సులతో కళ తెచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనలోని డ్యాన్సింగ్ టాలెంట్ ను సరిగ్గా వాడుకుని అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేసిన మాస్టర్ ప్రభుదేవా. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టే. తాను డ్యాన్స్ కంపోజ్ చేసిన వాళ్లలో చిరంజీవే ది బెస్ట్ అంటాడు ప్రభుదేవా. ఇప్పటికీ చిరంజీవితో పని చేయాలని తనకుందని.. కానీ మెగాస్టార్ 150వ సినిమాలో తనకు ఛాన్స్ ఇవ్వలేదని ప్రభు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

??డ్యాన్స్ విషయంలో నా ఆల్ టైం ఫేవరెట్ చిరంజీవిగారే. ఆయన పిలిస్తే చాలు వెళ్లిపోతాను. మెగాస్టార్ 150వ సినిమాకు డ్యాన్స్ కంపోజ్ చేయమని అడిగితే తప్పకుండా చేస్తా. కానీ నన్నెవరూ అడగలేదు?? అన్నాడు ప్రభుదేవా. ఈ సినిమా మొదలవకముందే చిరు పిలిస్తే కచ్చితంగా డ్యాన్స్ కంపోజ్ చేస్తానన్నాడు ప్రభు. అయినా చిరు నుంచి పిలుపు రాకపోవడం ఆశ్చర్యమే.

ఇప్పటిదాకా ?ఖైదీ నెంబర్ 150? టాకీ పార్ట్ మాత్రమే షూట్ చేశారు. ఇంకా పాటల చిత్రీకరణ మొదలవలేదు. పాటలు కూడా ఇంకా రెడీ అయినట్లు లేవు. దేవిశ్రీ ఆ పని పూర్తి చేశాక డ్యాన్స్ ఎవరితో కంపోజ్ చేయాలో నిర్ణయిస్తారేమో. మరి అప్పుడు ప్రభుదేవాకు పిలుపు వస్తుందో లేదో చూడాలి. చిరుకు ప్రభుదేవా స్టెప్స్ కంపోజ్ చేస్తే మాత్రం జనాల్లో మంచి ఆసక్తి ఉంటుంది. అతను ఒక పాట చేసినా అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి చిరు-వినాయక్ ప్రభును కన్సిడర్ చేస్తారో లేదో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,