Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 12:23:35
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సిరీస్ లో దేవసేనగా నటించిన అనుష్క.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మొదటి భాగంలో ఈమె పాత్ర అంతగా లేకపోయినా.. రెండో పార్ట్ కి మాత్రం దేవసేన పాత్ర కీలకంగా నిలిచింది. ఇప్పుడు బాహుబలి జోష్ నుంచి బయటకు వచ్చి భాగమతి షూటింగ్ కూడా చేసేస్తోంది అనుష్క.

తమిళనాడులోని పొలాచ్చి ప్రాంతంలో భాగమతి కోసం షూటింగ్ చేస్తున్నారు యూనిట్. ఆ సంగతి ఓకే కానీ.. రీసెంట్ గా శ్రీకాళహస్తిలో ఈ స్వీటీ ప్రత్యేక పూజలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అనుష్కకు కాళహస్తి పూజలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఓ పెద్ద హీరోతో కలిసి ఇలాంటి పూజలే చేయడంతో.. పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. కానీ అది సినిమా కోసం మాత్రమే అని తేలడంతో.. అప్పటికి అవి సద్దుమణిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాహుబలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక అనుష్క పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ చాలానే ఉన్నాయి.

ఇప్పటికే అనుష్కకు కాబోయే భర్త అంటూ పలు పేర్లు కూడా వినిపించేస్తోంది మీడియా. వీటిలో ఏ విషయాన్ని అనుష్క కానీ.. ఆమె బంధువులు కానీ ఫైనల్ చేయలేదు. కానీ ఇప్పుడు శ్రీకాళహస్తిలో పూజలు చేయడం మాత్రం.. పెళ్లి పనుల్లో భాగంగానే జరుగుతోందనే టాక్ మళ్లీ గుప్పుమంటోంది.

,  ,  ,  ,  ,