Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 13:09:50
facebook Twitter Googleplus
Photo

మంచు విష్ణు లేటెస్ట్ మూవీ ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చారు. అనౌన్స్ మెంట్ రోజున ఇచ్చిన పోస్టర్ నుంచే ఈ చిత్రం అందిరినీ ఆకట్టుకుంటోంది. టైటిల్ నుంచి విష్ణు-బ్రహ్మీల కాంబినేషన్ వరకూ ప్రతీ విషయంలో ఆసక్తిని కలిగిస్తోంది.

ఇప్పుడీ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటించే హీరోయిన్ ని ఫైనల్ చేశారు. కంచె చిత్రంతో ఖ్యాతి గడించిన ప్రగ్యా జైస్వాల్ ను ఆచారి అమెరికా యాత్రలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. రీసెంట్ గా ఈ భామ మంచు విష్ణు తమ్ముడు మనోజ్ సరసన గుంటూరోడు చిత్రంలో నటించింది. ఇప్పుడీ చిన్నదాన్ని గుంటూరు నుంచి ఏకంగా అమెరికా తీసుకెళ్లిపోతున్నాడు అన్నయ్య విష్ణు. సాంప్రదాయ బద్ధంగా కనిపించాల్సిన రోల్ కావడం.. పైగా పెర్ఫామెన్స్ కు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతోనే.. ప్రగ్యా జైస్వాల్ కు మొగ్గు చూపినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

మే నెల మొదటి వారం నుంచి ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ హైద్రాబాద్ లో జరగనుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,