Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:30:52
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని ఆ సీనిమాకు సంబంధించిన న్యూస్ ఎదో ఒకటి రోజు హల్ చల్ చేస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు రూమర్స్ గాసిప్స్ ఏ మాత్రం ఆగేలా కనిపించడం లేదు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం తో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ లుక్ దగ్గరి నుంచి యాక్షన్ సీన్స్ వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్త్తోంది.

ఇక యువ దర్శకుడు సుజిత్ కెరీర్ లో రెండవ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోవడం కాయం. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమాలో యాక్షన్ పార్ట్ కోసం చిత్ర యూనిట్ ఈ పాటికి దుబాయ్ వెళ్లాలి. కానీ ఇంకా హైదరాబాద్ లోనే కొన్ని సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు అవుట్ ఫుట్ బావుండాలని చాలా కష్టపడుతున్నాడు. సీన్స్ విషయంలో చాలా ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా హైదరాబాద్ షెడ్యూల్ ముగిస్తేనే దుబాయ్ షెడ్యూల్ స్టార్ చేయాలని నిర్మాతలు ప్లాన్స్ వేసుకున్నారు. కానీ అనుకోని విధంగా ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ దుబాయ్ షెడ్యూల్ డేట్ ని మార్చేసింది. త్వరలోనే కొత్త డేట్ ని ఫిక్స్ చేసుకొని ఫారెన్ ట్రిప్ కి బయలుదేరానున్నారు.

దుబాయ్ లోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ ఆధ్వర్యంలో ఆ సీన్స్ షూటింగ్ జరగనుంది. ఆ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని ప్రేక్షకులు అంచనాలను అందుకుంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,