Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Mar-2017 11:04:35
facebook Twitter Googleplus
Photo

కంచె సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రగ్యాజైశ్వాల్... ఓం నమో వేంకటేశాయ చిత్రంలో కాసేపు మెరిసి మెప్పించింది. ఈ చిత్రంలో దర్శక కేంద్రుడు ప్రగ్యా అందాలను బాగానే చూపించారు. కమర్షియల్ లుక్ లో ప్రగ్యా అందాలు బాగానే వున్నాయి. తాజాగా మంచు మనోజ్ తో కలిసి గుంటూరోడు లో నటించింది. ఇది ప్రగ్యాకు తొలి కమర్షియల్ సినిమా. ట్రైలర్స్ తో ఇప్పటికే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. సినిమా ప్రమోషన్ కూడా పీక్స్. మార్చి మూడున రిలీజ్ కావడమే తరువాయి.

ప్రగ్యా మాట్లాడుతూ క్లాస్ టచ్ వున్నా సినిమాల్లో నటించడం చాలా కష్టం. ప్రతి సన్నివేషంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే కమర్షియల్ చిత్రంలోనైతే అలా కాదు. మనకు నచ్చినట్టు నటించేయొచ్చు. నాకైతే నా గత చిత్రాలకంటే.. గుంటూరోడులో నటించడం చాలా సులవు అనిపించింది. ఇందులో నేను లంగావోణి వేసుకున్న ఓ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తా. అలా సంప్రదాయదుస్తుల్లోనే కావాల్సినంత కమర్షియల్ యాంగిల్ చూపించా. యూత్ కు బాగా నచ్చుతుందని సెలవిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అంతేనా.. ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకుందట. అదే ఇప్పుడు కృష్ణవంశీ నక్షత్రం మూవీలో సీరియస్ పోలీస్ కాప్ క్యారెక్టర్ కు ఉపయోగపడిందని చెబుతోంది. ఈ చిత్రలో ఓ ఫైట్ సీన్ చేయడానికి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కరాటే ఎంతో ఉపయోగపడిందని చెబుతోంది. అలా కరాటేలో బాగా రాణించడానికి కారణం తన మమ్మీనే అని చెబుతోంది

,  ,  ,  ,  ,